;

ఎపిలో బిసి ఉద్యమానికి నాంది - డిసెంబర్ 11న విజయవాడలో ఏపీ బీసీ మహా సదస్సు

news

ఎపిలో బిసి ఉద్యమానికి నాంది

- డిసెంబర్ 11న విజయవాడలో "ఏపీ బీసీ మహా సదస్సు"

- భారత చైతన్య యువజన పార్టీ, ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు 

- రాజధానిలో వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్లు, బిసి రక్షణ చట్టం, రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర ప్రధాన ఎజెండాగా సదస్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ వర్గాల హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా ఒక చారిత్రాత్మక "ఏపీ బీసీ సదస్సు"ను నిర్వహిస్తున్నట్లు భారత చైతన్య యువజన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ఈ సదస్సు ఒక బలమైన వేదిక కానుందని పార్టీ పేర్కొంది. 

ఈ సదస్సులో ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు బిసివై పార్టీ ఆ పత్రికాప్రకటన లో తెలిపింది. 

సదస్సు ముఖ్య ఎజెండా:

1. రాజధానిలో బీసీ ఆత్మగౌరవం: నూతన రాజధానిలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం తక్షణమే 1000 ఎకరాల భూమి కేటాయించాలి

2.రాజకీయ సాధికారత: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44% రిజర్వేషన్లను చట్టబద్ధంగా పునరుద్ధరించాలి

3.చట్టబద్ధమైన రక్షణ: బీసీలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దాడులను అరికట్టేందుకు పటిష్టమైన "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలులోకి తీసుకురావాలి

4.రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రణాళికలో, అభివృద్ధిలో బీసీలకు సముచిత వాటా, భాగస్వామ్యం కల్పించాలి

సదస్సు వివరాలు: 

తేదీ మరియు సమయం: డిసెంబర్ 11, 2025 (గురువారం), ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.

వేదిక: హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్, విజయవాడ


ఈ సదస్సుకు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను, అన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులను, బీసీ మేధావులను, విద్యావంతులను, మీడియా మిత్రులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు బిసివై పార్టీ తెలిపింది. సదస్సు అనంతరం సాయంత్రం 5:00 గంటలకు సదస్సు తీర్మానాలను మీడియాకు వివరించడం జరుగుతుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉన్నందున, సదస్సులో పాల్గొనదలచిన వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని బిసివై పార్టీ సూచించింది. 


నమోదు కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 


8886312345

9121258958

9440575120

8886268886

8121642233

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......