తెలంగాణలో బీసీ రాజకీయ ఐక్యతకు అఖిలేష్ యాదవ్ పర్యటన – ఘన స్వాగతం తెలిపిన బేరి రామచంద్ర యాదవ్
తెలంగాణలో బీసీ రాజకీయ ఐక్యతకు అఖిలేష్ యాదవ్ పర్యటన
– ఘన స్వాగతం తెలిపిన బేరి రామచంద్ర యాదవ్
శేరిలింగంపల్లి,
బీసీ రాజకీయ ఐక్యత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్‌కు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసేలా సమైక్యత యాత్ర చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్, బీసీ కులగణన అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకురావాలని అఖిలేష్ యాదవ్‌ను కోరారు.
అఖిలేష్ యాదవ్ తన తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై బీసీ రాజకీయ ఐక్యతపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా నిలబడి బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం చేయాలని బేరి రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన అఖిలేష్ యాదవ్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, బీసీ ఉద్యమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీలను సంఘటితం చేసి అసెంబ్లీ, పార్లమెంటులలో కనీసం 50 శాతం ప్రాతినిధ్యం సాధించే దిశగా స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నేతలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మందాడి అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......