;

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించాలి: కోడూరి చంద్రయ్య డిమాండ్

news

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించాలి: కోడూరి చంద్రయ్య డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు కోడూరి చంద్రయ్య తీవ్రంగా విమర్శించారు.

ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని, పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలను పాత బీసీ రిజర్వేషన్ల విధానంలో నిర్వహించడం ద్వారా బీసీలను తెలంగాణ రాష్ట్రంలో వంచించినట్లే జరిగిందని ఆరోపించారు.

ఇప్పుడు జరగబోయే ఎంపిటిసి (మండల పరిషత్), జడ్పిటిసి (జిల్లా పరిషత్) ఎన్నికలలో అయినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లివచ్చినా, ఏఐసీసీ సమావేశాలలో గానీ, పార్లమెంట్ లోక్‌సభ సమావేశాలలో గానీ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని చంద్రయ్య అన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రతిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి తీసుకురాకపోవడం కూడా ముఖ్యమంత్రి నిర్లక్ష్య ధోరణినే స్పష్టంగా చూపుతోందని విమర్శించారు.

ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని గుర్తు చేసిన కోడూరి చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి, దానిని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చేలా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగేలా పార్లమెంటులో గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో

బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో-కన్వీనర్ కడార్ల నరసయ్య,

మూల భాస్కర్ గౌడ్,

జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్,

పొనకల్ గ్రామ మొదటి వార్డు సభ్యుడు ముధురుకోల్ల రవి,

రెండవ వార్డు సభ్యుడు పిళ్లి మల్లయ్య,

పొనకల్ పట్టణ వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్,

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకులు గోపి సత్యనారాయణ,

జన్నారం మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు అయిలవేణి రవి

తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......