న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన కేసన శంకరరావు
న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన కేసన శంకరరావు
ఓబీసీ జనగణన, జనాభా దామాషా రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాలి – రిప్రజెంటేషన్ సమర్పణ
న్యూఢిల్లీ:
న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షాని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు గారు కలిసి, ఓబీసీల ప్రధాన డిమాండ్లపై సమగ్ర రిప్రజెంటేషన్ సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే జనగణనలో బీసీ కులాల వారీగా కుల జనగణన నిర్వహించి, ఓబీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం అత్యవసరమని స్పష్టం చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసి, పెంచిన ఓబీసీ రిజర్వేషన్లను షెడ్యూల్–9లో చేర్చి సంపూర్ణ రాజ్యాంగ రక్షణ కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మీడియాతో మాట్లాడుతూ కేసన శంకరరావు గారు, బీపీ మండల్ నివేదిక కాలంలో ఓబీసీల జనాభా 52 శాతం కాగా, ప్రస్తుతం అది 60 శాతానికి మించిపోయిందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సామాజిక న్యాయం లక్ష్యం ఉన్నప్పటికీ, వాస్తవంగా ఓబీసీలకు అన్ని రంగాలలో సముచిత న్యాయం అందడం లేదన్నారు.
73వ, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీలు, మునిసిపాలిటీలలో ఓబీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి అడ్డంకి కారణంగా ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
దీని ఫలితంగా:
- ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఓబీసీలకు కేటాయించిన 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గిపోయాయని,
- తెలంగాణలో గత ప్రభుత్వం 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించిందని,
- ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ల గతి ఏమైందో స్పష్టత లేదని విమర్శించారు.
ఇక 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్లే 50 శాతం పరిమితి ఇప్పటికే మించిపోయిందని గుర్తుచేస్తూ, ఎస్సీ–ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకూ జనాభా దామాషా రిజర్వేషన్లు కల్పించాల్సిందే అన్నారు. ఇందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న 50 శాతం పరిమితిని అధిగమించేందుకు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
అదనంగా ఆయన రిప్రజెంటేషన్‌లో కోరిన ముఖ్య డిమాండ్లు:
- చట్టసభలలో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి ఓబీసీ మహిళలకు సబ్-కోటా,
- ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు,
- హైకోర్టు–సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో ఓబీసీ రిజర్వేషన్లు,
- ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల తక్షణ భర్తీ,
- ప్రైవేటు రంగంలో కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.
వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలతో పాటు సమస్త జీవన రంగాలలో ఓబీసీలకు జనాభా దామాషా మేరకు – “మేమెంతో, మాకంత” వాటా ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......