పేరుపాలెం బీచ్‌లో న్యూ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్స్
పేరుపాలెం బీచ్‌లో న్యూ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ 🌊
– ఈవెంట్ నిర్వాహకుడు: నాగిడి సాంబశివరావు
పశ్చిమ గోదావరి జిల్లా, డిసెంబర్ 31:
ఆంధ్రప్రదేశ్‌లోని పేరుపాలెం బీచ్‌లో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిసారిగా బీచ్ సైడ్‌లో గోవా స్టైల్‌లో నిర్వహించనున్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి యువతతో పాటు కుటుంబ సభ్యుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని ఈవెంట్ నిర్వాహకుడు నాగిడి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండనుంది.
ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం సభ్యులతో లైవ్ స్కిట్స్, ఢీ జోడి గ్రూప్‌తో గ్రూప్ డాన్సులు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ వన్స్ మోర్ వాసు ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకోనుంది. అదనంగా సినీ పాటల లైవ్ సింగింగ్, డీజే నైట్, లైవ్ మ్యూజిక్‌తో పాటు ప్రత్యేక ఫైర్‌వర్క్స్ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి న్యూ ఇయర్ కౌంట్‌డౌన్, కేక్ కటింగ్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
బీచ్ పక్కన సముద్ర అలల మధ్య స్నేహితులు, జంటలు, బ్యాచిలర్స్, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రత, పార్కింగ్, ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని పేర్కొన్నారు.
టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
VIP టికెట్ ధర రూ.999 కాగా, స్టాగ్/నార్మల్ టికెట్ ధర రూ.599 మాత్రమే. VIP టికెట్‌తో సెలబ్రిటీలతో కలిసి ప్రత్యేక గ్యాలరీలో కార్యక్రమం వీక్షించే అవకాశం, అన్‌లిమిటెడ్ చికెన్ బిర్యాని, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. నార్మల్ టికెట్‌తో అన్‌లిమిటెడ్ బిర్యాని, కూల్ డ్రింక్స్ అందిస్తారు.
ముందస్తు బుకింగ్ చేసుకునేవారికి ప్రత్యేక రాయితీలు కూడా కల్పిస్తున్నట్లు నాగిడి సాంబశివరావు తెలిపారు. “ఈ న్యూ ఇయర్‌ను సిటీలో కాకుండా బీచ్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలుగా మార్చుకుందాం” అని ఆయన పిలుపునిచ్చారు.
టికెట్ల వివరాలు, బుకింగ్ కోసం
📱 9000466522 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
📎 Similar News
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......