;

గవర జాతీయుల సావినీర్ పంపిణీకి విస్తృత పర్యటన

news

గవర జాతీయుల సావినీర్ పంపిణీకి విస్తృత పర్యటన

రాజమండ్రి నుంచి కాకినాడ వరకు గౌరీ సంఘాల పెద్దలతో భేటీ

రాజమండ్రి / కాకినాడ (ప్రత్యేక ప్రతినిధి):
అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర జాతీయుల చరిత్ర, సంస్కృతి, సామాజిక సేవలను ప్రతిబింబించేలా రూపొందించిన గవర జాతీయుల సావినీర్ ను విస్తృతంగా పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

501 పేజీలతో 51 వేల ప్రతులుగా ముద్రించిన ఈ సావినీర్‌ను గవర జాతీయులలోని ప్రముఖులు, గౌరీ సంఘాల పెద్దలకు అందజేయడానికి ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని రూపొందించినట్లు ట్రస్ట్ సభ్యుడు ఆడారి ఉమా శంకరరావు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తేది : 01-01-2026 సాయంత్రం రాజమండ్రికి చేరుకుని, 02-01-2026 న రాజమండ్రి, దవలేశ్వరం, శ్రీరంగపట్నం మరియు పరిసర గ్రామాల్లోని గౌరీ సంఘాల పెద్దలను కలసి “గవర జాతీయుల – సావినీర్ బ్రోచర్లు” అందజేయనున్నారు. అనంతరం 04-01-2026 న స్వగ్రామానికి తిరిగి చేరుకుంటారు.

అలాగే 05-01-2026 న అనకాపల్లిలో నిర్వహించనున్న సీనియర్ సిటిజన్ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
తదుపరి 06-01-2026 నుండి 11-01-2026 వరకు పిఠాపురంలోని బాబా ఆశ్రమంలో ఉంటూ, కాకినాడ, కిర్లంపూడి సహా చుట్టుపక్కల గవర జాతీయులు నివసించే అన్ని ప్రాంతాల్లో పర్యటించి, గౌరీ సంఘాల పెద్దలను కలసి సావినీర్ బ్రోచర్లను అందజేయనున్నట్లు వెల్లడించారు.

గవర జాతీయుల ఐక్యత, సామాజిక చైతన్యం, భవిష్యత్ తరాలకు ప్రేరణ కల్పించే లక్ష్యంతో ఈ సావినీర్ రూపొందించబడిందని, ఇది జాతీయ స్థాయిలో గవర సమాజానికి ఒక చారిత్రాత్మక డాక్యుమెంట్‌గా నిలుస్తుందని సంఘ పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలిస్తే నిర్వహించబడతాయని ట్రస్ట్ వర్గాలు స్పష్టం చేశాయి.


సంప్రదించవలసిన నంబర్:
ఆడారి ఉమా శంకరరావు
📞 8328417559

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......