నంద్యాల: ముతుకూరి గౌడప్ప యాదవ్ 224వ వర్ధంతి ఘన నివాళులు
నంద్యాల: ముతుకూరి గౌడప్ప యాదవ్ 224వ వర్ధంతి ఘన నివాళులు
భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి దశలోనే పోరాటం చేసి, 1801 డిసెంబర్ 31న ఉరి కొయ్యను ముద్దాడి వీరమరణం పొందిన స్వాతంత్ర సమరయోధుడు ముతుకూరి గౌడప్ప యాదవ్ గారి 224వ వర్ధంతిని నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
నంద్యాల పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు, యాదవ సంఘం, విద్యార్థి-యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌడప్ప యాదవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి బహుజన నాయకులు ఘన నివాళులు అర్పించారు.
వక్తలు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల అన్యాయాలకు ఎదిరించి ప్రాణత్యాగం చేసిన గౌడప్ప యాదవ్ గారి పోరాట స్ఫూర్తి దేశ స్వాతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగం నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు.
యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఉద్యమాత్మకంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువజనులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......