ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు స్టైపెండ్ పెంపు – ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు స్టైపెండ్ పెంపు – ప్రభుత్వం ఉత్తర్వులు
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర సందర్భంగా శుభవార్త తెలిపింది. శిక్షణ కానిస్టేబుళ్లకు ప్రతి నెలా చెల్లించే స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా రూ.7,500 పెరుగుదల జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో చివరిసారిగా శిక్షణ కానిస్టేబుళ్ల స్టైపెండ్ పెంచగా, ఆ తర్వాత గత 13 ఏళ్లుగా ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ప్రభుత్వం 6,014 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. డిసెంబరు 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి శిక్షణకు పంపారు. ఆ సందర్భంగా స్టైపెండ్‌ను రూ.12 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించగా, తాజాగా ఆ హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ నిర్ణయం శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు, విధుల పట్ల మరింత ఉత్సాహం, క్రమశిక్షణ పెంపొందించడంలో దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......