బీసీ సంఘం ఆధ్వర్యంలో జన్నారంలో సావిత్రిబాయి పూలే జయంతి
బీసీ సంఘం ఆధ్వర్యంలో జన్నారంలో సావిత్రిబాయి పూలే జయంతి
జన్నారం, జనవరి 3:
జన్నారం మండల కేంద్రంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం జన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో నేడు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ మాట్లాడుతూ, స్త్రీలకు విద్య అనే వెలుగును అందించిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే గారని అన్నారు. అక్షరాల ద్వారా చీకటిలో ఉన్న సమాజానికి దారి చూపిన విప్లవమాతగా ఆమె చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. అనేక అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొని మహిళల విద్య కోసం పోరాడిన ధైర్యశాలిగా సావిత్రిబాయి పూలే గారు ఆదర్శప్రాయులని తెలిపారు. ఆమె వేసిన విద్యాబాటలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో-కన్వీనర్ కడార్ల నరసయ్య, పొనకల్ గ్రామ వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కంచె నరసయ్య, కట్ట వెంకటేశ్వర్లు, శ్రీరాముల ఆంజనేయులు, వడ్డెర సంఘం నాయకుడు కుంట సాలయ్య, రిటైర్డ్ టీచర్ సీలోజు రాజబాబు, మైనార్టీ నాయకుడు షేక్ మజర్ తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను స్మరించుకుంటూ, విద్యా-సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......