సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని పూలమాలలతో ఘనంగా నిర్వహించిన విద్యార్థి,యువజన ప్రజా సంఘాలు
*సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని పూలమాలలతో ఘనంగా నిర్వహించిన విద్యార్థి,యువజన ప్రజా సంఘాలు*
*సావిత్రిబాయి పూలే ను మహిళలు, విద్యార్థినిలు ఆదర్శంగా తీసుకోవాలి*
*మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి*
స్థానిక నంద్యాల పట్టణం బొమ్మలసత్రం నందు వున్న పి.యస్.సి&కే.వి.యస్.వి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్.రియాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెరుగు శివ కృష్ణ యాదవ్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు,BAMCEF రాష్ట్ర నాయకులు డా.నిరంజన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీదేవి, రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీనివాసులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కడియం సాంబశివుడు, మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో మాయా గాని అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఓ చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించారని, సావిత్రిబాయి పూలే గారి కి తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతి రావు పూలే గారికి ఇచ్చి 1840 లో వివాహం చేసుకున్నారు , జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి,విద్యావంతురాలైనదని,సావిత్రిబాయి పూలే గారు అట్టడుగు వర్గాల మహిళలు చదువులకు మరియు వారి సంపద వంటి సమస్త హక్కులకోసం, దేశంలో అప్పటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా 1848లో మొట్ట మొదటి పాఠశాలను ప్రారంభించారు, స్త్రీలకు విద్య అందించడానికి ఉపాధ్యాయురాలిగా వెళ్తున్న సమయంలో అనేక అవమానాలు ఎదురైనా కూడా పట్టించుకోకుండా స్త్రీల విద్య అభివృద్ధికి కృషి చేసిందని, అంటరానితనం,కుల నిర్మూలన, కోసం పోరాడిన సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు,
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశ్వర్లు, సునంద లక్ష్మి,రాధిక, వేదవతి, ప్రశాంతి, హిమబిందు,సుకుమార్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......