;

మున్సిపల్ ఎన్నికల్లోనూ మళ్లీ బీసీలకు అన్యాయమే - కుందారం గణేష్ చారి

news

తేదీ : 17-01-2026

మున్సిపల్ ఎన్నికల్లోనూ మళ్లీ బీసీలకు అన్యాయమే

42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?

నిన్న సర్పంచ్ ఎన్నికలు, నేడు మున్సిపల్ ఎన్నికలు, రేపు ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇదే విధంగా నిర్వహించరనే నమ్మకం ఏముంది? బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

15 శాతం మాత్రమే ఉన్న అగ్రకులాలకు 61 మున్సిపల్ చైర్మన్ స్థానాలు కేటాయించి, 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 38 స్థానాలు మాత్రమే ఇవ్వడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. చైర్మన్ పదవుల్లో బీసీలకు 31 శాతం, కౌన్సిలర్లు–కార్పొరేటర్లలో కేవలం 28 శాతం మాత్రమే కేటాయించడం ద్వారా ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కిందని ఆరోపించారు. బీసీలకు ద్రోహం చేస్తున్న రాజకీయ పార్టీలను రాజకీయంగా బొంద పెట్టాలని హెచ్చరించారు.

మీడియా సమావేశంలో వెల్లడి

హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మరోసారి మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఎన్నికలు నిర్వహించబోమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు మాట తప్పి మున్సిపల్ ఎన్నికలకు ముందుకు రావడం ద్రోహమని అన్నారు.

బీసీల తరఫున ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు తందాన అంటున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించడం అత్యంత సిగ్గుచేటు వ్యవహారమని విమర్శించారు.

రిజర్వేషన్లలో తీవ్ర కోత

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, అందులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.

మొత్తం 121 మున్సిపల్ చైర్మన్ స్థానాలకు గాను బీసీలకు కేవలం 38 స్థానాలు (31%) మాత్రమే కేటాయించారని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 42 శాతం అమలు చేసి ఉంటే బీసీలకు 52 చైర్మన్ స్థానాలు దక్కేవని, అందువల్ల 14 స్థానాలు కోల్పోయారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 56 శాతం కేటాయిస్తే 68 మున్సిపల్ చైర్మన్ స్థానాలు రావాల్సి ఉండగా, అలా చేయకపోవడం వల్ల 30 చైర్మన్ స్థానాలు నష్టపోయారని వెల్లడించారు.

మొత్తం 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు కేవలం 3 మేయర్ స్థానాలు (30%) మాత్రమే రిజర్వ్ చేయడం అన్యాయమన్నారు.

కౌన్సిలర్లు–కార్పొరేటర్లలోనూ అన్యాయం

121 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న 2704 కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లో బీసీలకు కేవలం 763 (28%) మాత్రమే రిజర్వ్ చేశారని తెలిపారు. 42 శాతం అమలు చేసి ఉంటే 1150 మందికి అవకాశం దక్కేదని, ఇప్పుడు 387 మంది బీసీలు అవకాశాలు కోల్పోతున్నారని ఆరోపించారు.

అగ్రకులాల మహిళలకు 788 స్థానాలు కేటాయించి, బీసీలకు వారి కంటే తక్కువగా 763 స్థానాలు ఇవ్వడం అత్యంత అవమానకరమని అన్నారు.

2020 మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు ఉండగా, 2026 ఎన్నికల్లో ఒక్క శాతం తగ్గించి 31 శాతానికి పరిమితం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

క్యాబినెట్‌కు హెచ్చరిక

రేపు సమ్మక్క–సారక్క వద్ద జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజానికి దోషిగా మిగిలిపోతుందని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు నిరసనగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో పాల్గొన్నవారు

ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. మణి మంజరి సాగర్, గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాదేశి రాజేందర్ గంగపుత్ర, సంచార జాతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జెల్ల నరసింహ, గూడూరు భాస్కర్ మేరు, బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గజ్జల సత్యం గౌడ్, నరసింహ చారి, బండి గారి రాజు, వెంకటమ్మ, సందీప్ ముదిరాజ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......