ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ?
ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ?
నిరుద్యోగ విద్యార్థులపై ప్రభుత్వానికి ప్రేమ ఏది?
ఈ నెల 31న హైదరాబాద్‌లో ‘నిరుద్యోగ సింహగర్జన’
చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు కనిపించడంలేదని, రాజకీయ నిరుద్యోగులపై చూపిస్తున్న ప్రేమ నిరుద్యోగ విద్యార్థులపై ఎందుకు లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ సింహగర్జన – చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను నేడు హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు మోతిలాల్ నాయక్, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,
“మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, డీఎస్సీ, ఇంజినీరింగ్ తదితర ఖాళీ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం తీవ్ర అన్యాయం” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉద్యమిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయడం బాధాకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌తో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ – నిరుద్యోగ సింహగర్జన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్,
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్,
బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. మణి మంజరి సాగర్,
గూడూరు భాస్కర్, వినోద్, అనిల్, ఆకాష్, భాష, తండు రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......