;

బిడ్డల భవిష్యత్ కు శాపంగా మారుతున్న బిసి ఉద్యమాలు ..

news

బిడ్డల భవిష్యత్ కు శాపంగా మారుతున్న బిసి ఉద్యమాలు ..

బిసి లు అప్రమత్తం కావాలి.
బిసి ల అట్రాసిటీ ముసాయిదా బిల్లు వారి ఆత్మ గౌరవ భవిష్యత్ కు ప్రమాదం

అమరావతి / హైదరాబాద్ :
బిసి ల పిల్లల భవిష్యత్‌కు తీవ్ర ముప్పుగా మారుతున్న బిసి అట్రాసిటీ ముసాయిదా బిల్లుపై బిసి సమాజమంతా అప్రమత్తం కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

అనాదిగా దళితులపై ప్రయోగించిన ఒక విషపూరిత కుట్రను నేడు అదే తరహాలో బిసి లపై ప్రయోగించేందుకు పాలక వర్గాలు సిద్ధమవుతున్నాయని ఆయన ఆరోపించారు.
బిసి అట్రాసిటీ ముసాయిదా బిల్లు అంటే బిసి లను మరో వందేళ్ల పాటు అంటరాని వారిగా ముద్ర వేయడమేనని స్పష్టం చేశారు.

బిసి లకు అట్రాసిటీ చట్టం ఎందుకు? – కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి

బిసి లు ఎప్పుడూ అంటరాని వారు కాదని, అస్పృశులు కాదని,
బిసి లే అనేక రాజ్యాలను ఏలిన చరిత్ర కలిగిన వర్గాలని మేడా శ్రీనివాస్ గుర్తు చేశారు.

“బిసి లు అంటరాని వారమని మేమెప్పుడు అడిగాం?
బిసి లకు కుల దూషణ చట్టం కావాలని ఎవరు కోరారు?
ఈ ముసాయిదా బిల్లుకు ప్రాతిపదిక ఏమిటో చెప్పే ధైర్యం కూటమి సర్కార్‌కు ఉందా?”
అని ఆయన ప్రశ్నించారు.

కాపులను బిసి కేటగిరీలో చేర్చాలని జరుగుతున్న ఉద్యమాలపై స్పందించని ప్రభుత్వం,
బిసి లను అస్పృశులుగా ముద్ర వేయే బిల్లును తెచ్చిందని విమర్శించారు.

బిసి లపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ – ఆర్థిక రిజర్వేషన్లు ఇవ్వాలి

బిసి లపై చిత్తశుద్ధి ఉంటే
👉 రాజకీయ రిజర్వేషన్లు
👉 సంపద ఆధారిత ఆర్థిక రిజర్వేషన్లు
కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

మనుధర్మం ఆధారంగా రూపొందించిన అబద్దపు చరిత్రను
దళితులు – బిసి లపై అనాదిగా రుద్దుతున్నారని ఆరోపించారు.

అంబేద్కర్ ఆశయాన్ని వక్రీకరిస్తున్న నేటి కుల రాజకీయాలు

డా. బి.ఆర్. అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడారని,
కాని నేడు ఆయన పేరును ఉపయోగించి సంపన్న వర్గాలు
దళిత – బిసి ల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు.

“రిజర్వేషన్ కులానికి కాదు, సంపదకు అని అర్థం చేసుకున్న రోజే
కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్ మీడియా కూలిపోతాయి”
అని ఆయన వ్యాఖ్యానించారు.

బిసి అట్రాసిటీ బిల్లు – చాక్లెట్ ఇచ్చి భవిష్యత్ దోచే కుట్ర

ఈ ముసాయిదా బిల్లు
👉 బిసి లను సంపన్నులుగా ఎదగనీయదు
👉 శాశ్వతంగా సంక్షేమ పథకాలపై ఆధారపడేలా చేస్తుంది
👉 రాజకీయ దయా దాక్షిణ్యాలపై జీవించే స్థితికి నెట్టేస్తుంది

ఇది “బ్రతకనీయదు – చావనీయదు” అనే రాజకీయ ఉచ్చు అని హెచ్చరించారు.

కుల ఉద్యమాల వల్ల లాభపడింది ఎవరు? – ఆత్మ విమర్శ అవసరం

ఇప్పటివరకు కుల ఉద్యమాలు, కుల రిజర్వేషన్ల వల్ల
బిసి – దళిత – మైనార్టీలకు నిజంగా ఏమి లాభం జరిగిందో,
భవిష్యత్‌లో ఏమి కోల్పోతామో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

బహిరంగ చర్చకు సిద్ధం – మేడా శ్రీనివాస్ సవాల్

బిసి అట్రాసిటీ ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధత,
దాని వెనుక ఉన్న అంతర్గత కుట్రపై
ఏ పాలక మేధావితోనైనా బహిరంగ చర్చకు సిద్ధం అని
మేడా శ్రీనివాస్ సవాల్ విసిరారు.

బిసి ల భవిష్యత్‌ను కాపాడుకోవాలంటే ఇప్పుడే మేల్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


– మేడా శ్రీనివాస్
MA, LLM, MA (Journalism), MA (MJMC)
వ్యవస్తాపక అధ్యక్షులు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
📞 మొబైల్ : 9248777222

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......