రాష్ట్రములోని బెస్తలు కూటమి వెంటే: నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన బెస్త మల్లికార్జున
మంగళగిరి:
స్థానికంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం బూత్ అబ్జర్వర్ల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ హాజరై, పాల్గొన్న నాయకులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయికి వెళ్లి అక్కడి పరిస్థితులను సమగ్రంగా తెలుసుకోవాలని, కనీసం ప్రతి బూత్‌కు ఒక రోజు సమయం కేటాయించి, బూత్‌లో పార్టీ నిర్మాణం ఎలా బలపడుతుందో చర్చించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
అనంతరం నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ బెస్త ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో బెస్తల పాత్ర కీలకమైందని అన్నారు. బెస్త సామాజిక వర్గానికి ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ బెస్త కార్పొరేషన్‌కు చైర్మన్, డైరెక్టర్లను నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఆఫ్కౌఫ్ (ఫిషరీస్) చైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన యువనేత కడప యాటగిరి రాం ప్రసాద్ ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాం ప్రసాద్ ఎంపికతో రాష్ట్రంలో బెస్తలకు రాజకీయ గుర్తింపు మరింత బలపడిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బెస్త సామాజిక వర్గం తరఫున నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
దీనికి స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపిన జీఓ 217ను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే మత్స్యకారులకు 50 సంవత్సరాల వయస్సు నుంచే పింఛన్ అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలైన ముఖ్య నిర్ణయమని చెప్పారు. మత్స్యకారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వానికి మరియు సమాజానికి మధ్య వారధిగా ఉండే నాయకులు బెస్తల విద్య, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......