మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం: కర్నూలు ఎంపీ, కొడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ పరిధిలోని సుంకేసుల డ్యామ్ వద్ద చేప పిల్లల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కర్నూలు ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు, కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి చేతుల మీదుగా మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ బి.ఎస్. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 1.66 లక్షల చేప పిల్లలను జలాశయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, మత్స్యకారుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. సాంప్రదాయ మత్స్యకారులను ఎస్.టి జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ, మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సుంకేసుల జలాశయంలో 4.16 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని, దీని ద్వారా మత్స్యకారులకు గణనీయమైన లాభం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ శ్రీ రంగనాథ్ బాబు, బెస్టా కార్పొరేషన్ డైరెక్టర్లు రామాంజనేయులు, భాస్కర్, ఎఫ్‌డీఓ మద్దిలేటి, జిల్లా డైరెక్టర్ శ్రీనివాసులు, సుంకేసుల సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మత్స్యకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......