ఎఫ్ ఆర్ టి ఐ నేతలు పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో భేటీ
ఎఫ్ ఆర్ టి ఐ నేతలు పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో భేటీ
తిరుపతి
ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి.చంద్రమోహన్,జాతీయ అధ్యక్షులు మట్టా.ప్రసాద్ సూచనల మేరకు,జాతీయ సంయుక్త కార్యదర్శి కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో తిరుపతి జిల్లా , పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ డి వి.నాగేశ్వర రావు గారితో, మరియు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ జె. చంద్ర శేఖర్
గారితో,ఈ రోజు సమావేశం అయ్యి చట్టాలతో కూడిన ఫోరం ఫర్ ఆర్ టి ఐ నూతన క్యాలెండర్ను అందించి, ఈ ఆఫీస్ లో సంబంధిత శాఖల నుంచి సామాన్య ప్రజలకు కూడా కావలసిన సమాచారాన్ని ఆర్ టి ఐ చట్టం నిర్దేశిత గడువు లోపల అందించాలని కోరినప్పుడు,ఆర్ టి ఐ సెక్షన్స్ ప్రకారం,వారి శాఖ నుంచి సమాచారం అడిగిన ప్రజలకు వెంటనే అందేలా చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్డ్ శాఖలో హ్యూమన్ రైట్స్, సమాచార హక్కుచట్టం, లోకాయుక్త చట్టాల పరిధిలో బాగంగా , గవర్నమెంట్ తో సమన్వయం చేసుకుంటూ అందరికీ అవేర్నెస్ ఇవ్వటం జరుగుతుంది.సంబంధిత గవర్నమెంట్ శాఖల అధికారులు,ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సర్వీసెస్ ను, నిజాయితీగా మంచి పౌర సంబంధ సేవలతో, అవినీతికి దూరంగా ప్రజలు అందరికీ సర్వీసెస్ అందేలా చూడాలని కోరారు.అందుకు ఆయా శాఖల గవర్నమెంట్ పై అధికారులుగా, వారు రిప్లై ఇస్తూ సామాన్య ప్రజలకు కూడా నిజాయితీగా, మంచి సర్వీసెస్ అందేలా చూస్తామని సమాచారహక్కు చట్టం అప్పీలేటు అధికారుల ఫోన్ నంబర్స్, పేర్లు వారి ఆఫీసుల బయట, ప్రజలకు పారదర్శకతతో తెలిసేవిధంగా డిస్ప్లే లో ఎప్పుడూ ఉంచుతామని తెలిపారు.మరియు గవర్నమెంట్ అధికారులను సమన్వయం చేసుకుంటూ, స్వచ్ఛందంగా సమాజం పట్ల తమ దైన శైలిలో బాధ్యత గా వ్యవహరిస్తున్న ఎఫ్ ఆర్ టి ఐ నేతలకు ,ఆక్టివ్ మెంబెర్స్ కు లీగల్ గా తమ సహకారం అందిస్తామని తెలిపారు.అలాగే అవినీతికి తావులేకుండా,తమ ఆఫీసుల్లో సిబ్బంది అందరికీ, దిశానిర్దేశం చేసి పబ్లిక్ కు మంచి సేవలు అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జాతీయ కమిటీ నేత కె .అజయ్ ప్రసన్న కుమార్ తో పాటు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కరాటే డి సి ఎస్ రాయల్ , తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ బి. వెంకట్,తిరుపతి జిల్లా మహిళా ఇంచార్జి, నగరి పుత్తూరు నియోజక వర్గ ప్రెసిడెంట్ వి.జయ లక్ష్మీ, తిరుపతి జిల్లా ఇంచార్జి అధ్యక్షులు మరియు కమిటీ ప్రెసిడెంట్ జి.వేణు గోపాల్ పాల్గొన్నారు.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......