;

🌍🌱 ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం: “ఒక్క మొక్క.. భవిష్యత్ తరాలకు భరోసా” – మల్లంపల్లి సర్పంచ్ పోషాల వెంకన్న పిలుపు!

news

జనగామ జిల్లా: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (JMI) ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ ఆవరణలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లంపల్లి గ్రామ సర్పంచ్ పోషాల వెంకన్న గారు హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పచ్చని చెట్లు ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రజల జీవనాధారం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, దేశాభివృద్ధి అన్నీ ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి” అని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గంగరపు సరిత, వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ OHR వాటర్ ట్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు.


ఈ కార్యక్రమంలో JMI స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పెండ్లి అశోక్ బాబు, కన్నారపు పరశురాములు, తోడేటి అంజనేయులు, గదేపాక శ్రీనివాస్, పి.స్వరూప, పంచాయతీ కార్యదర్శి రాజు, అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు, ఆయాలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


🌿 “చెట్టు నాటితేనే భవిష్యత్ సురక్షితం… పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం” అంటూ కార్యక్రమం సందేశాత్మకంగా కొనసాగింది.

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......