సముద్రంలో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులను ప్రభుత్వం త్వరగా నిర్ధారించాలని విన్నపం
సముద్రంలో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులను ప్రభుత్వం త్వరగా నిర్ధారించాలని విన్నపం
వివాదాలకు అడ్డుకట్ట వేయాలని ఏపీ మత్స్యకార JAC రాష్ట్ర కార్యదర్శి ప్రళయ కావేరి వేణుగోపాల్ డిమాండ్
విడవలూరు (నెల్లూరు జిల్లా):
ఆంధ్ర–తమిళనాడు సముద్ర సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల ఈ ప్రాంత మత్స్యకారులు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ మత్స్యకార JAC రాష్ట్ర కార్యదర్శి ప్రళయ కావేరి వేణుగోపాల్ఆం దోళన వ్యక్తం చేశారు.
విడవలూరు మండల సముద్రతీరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, సరిహద్దుల గందరగోళం కారణంగా చేపల వేటకు వెళ్లే తెలుగు మత్స్యకారులను తమిళనాడు అధికారులు అనవసరంగా అడ్డుకోవడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ వివాదాలను శాశ్వతంగా నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు ప్రభుత్వాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సముద్ర వేట ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించి స్పష్టమైన సరిహద్దు రేఖలను ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు తగ్గుతాయని సూచించారు.
అంతేకాదు, రెండు రాష్ట్రాల మత్స్యకార సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరారు.
స్థానిక మత్స్యకారులు కూడా సరిహద్దు సమస్యలు తమ జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని విన్నవించారు.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......