ఐఏఎస్, ఐపీఎస్‌లపై జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ద్రావిడ దేశం కృష్ణారావు ఒంగోలు,
ఐఏఎస్, ఐపీఎస్‌లపై జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ద్రావిడ దేశం కృష్ణారావు
ఒంగోలు,
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానకరంగా సంబోధించిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బీసీ వర్గాలకు చెందిన అగ్రశ్రేణి అధికారులను ‘వాడు, వీడూ’ వంటి తక్కువ చేసి మాట్లాడటం బీసీ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. బీసీ కుటుంబంలో జన్మించి, ప్రతిభతో ఐఏఎస్ అవతారమెత్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక కీలక రంగాల్లో నిర్దోష సేవలు అందించిన పి. కృష్ణయ్య బీసీ వర్గాలకు గర్వకారణమని కృష్ణారావు గుర్తుచేశారు. చిన్నపాటి మచ్చ కూడా లేని వారి సేవలను నిర్లక్ష్యం చేయడం లేదా అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు.
అలాగే మరో ప్రతిష్టాత్మక అధికారి గోపీనాథ్ జెట్టి పై కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను బీసీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ అహంకారానికి నిదర్శనమని, వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
"జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే, వాటి ప్రభావం రాజకీయంగా వారి పార్టీకే నష్టాన్ని తేచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి" అని ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు హెచ్చరించారు.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......