మూడవ శాసనసభ ఏడవ సమావేశాలు ప్రారంభం
మూడవ శాసనసభ ఏడవ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్ర మూడవ శాసనసభ ఏడవ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి మరియు శాసనసభల కార్యదర్శులు ఘనంగా స్వాగతం పలికారు.
సభ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి స్థానం వద్దకు వెళ్లి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ దృశ్యం సభలో సౌహార్ద వాతావరణానికి నిదర్శనంగా నిలిచింది.
శాసనసభ తొలి రోజున దివంగత సభ్యులకు సంతాపం ప్రకటించింది. సూర్యాపేట మాజీ శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు, చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండా లక్ష్మారెడ్డి గార్ల మృతికి సభ సంతాప తీర్మానం చేసింది. సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించి వారికి నివాళులర్పించారు.
అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు జీరో అవర్‌ను చేపట్టారు. సభ్యులు పలు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. జీరో అవర్ అనంతరం శాసనసభను జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.
మూడవ శాసనసభ ఏడవ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చలు జరపనుండగా, ప్రతిపక్షాలు కూడా ప్రధాన సమస్యలను లేవనెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......