బీజేపీ ఓబీసీ మోర్చా రాయలసీమ జోన్ – నంద్యాల జిల్లా కమిటీ ప్రకటన .
తేదీ: 06-01-2026
స్థలం: నంద్యాల జిల్లా
నంద్యాల జిల్లాలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ప్రకటన కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బీజేపీ ఓబీసీ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షులు జక్కుల శ్రీధర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఓబీసీ మోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ మేకల బంగారయ్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు ఆసనపురం చంటి, అశోక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు అభిరుచి మధు గారు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగళి గోపి శ్రీనివాస్ గారి సారథ్యంలో, రాయలసీమ జోన్ పరిధిలో నంద్యాల జిల్లా ఓబీసీ జిల్లా కమిటీ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీ బి. అశ్విని కుమార్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ గానియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. నూతన బాధ్యతలు చేపట్టిన అశ్విని కుమార్ పార్టీ బలోపేతం, ఓబీసీ వర్గాల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......