;

అనకాపల్లికి పూర్వ వైభవం తీసుకురావాలి: దాడి కుటుంబంతో భేటీ అయిన టీడీపీ నేతలు

news

అనకాపల్లికి పూర్వ వైభవం తీసుకురావాలి: దాడి కుటుంబంతో భేటీ అయిన టీడీపీ నేతలు

అనకాపల్లి:

మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పూర్వ ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు (మాస్టారు) తనయులు — టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కాబోయే ఎమ్మెల్యే దాడి రత్నాకర్, అనకాపల్లి టీడీపీ యువనేత దాడి జయవీర్, అలాగే దాడి జగన్ ప్రభాకర్‌ను యలమంచిలి నియోజకవర్గ టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అనకాపల్లికి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. దాడి మాస్టారు స్వగృహంలో ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. నేతలను దాడి వీరభద్రరావు ఆత్మీయ ఆలింగనంతో సత్కరించారు.

ఈ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ నేత, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (D.F.C.S) మాజీ చైర్మన్, విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) డైరెక్టర్ వివేక్ గనగళ్ల, మునగపాక మండల టీడీపీ కార్యదర్శి మద్దాల కృష్ణ, రాంబిల్లి మండల టీడీపీ నేతలు కె.వి.ఎ. రావు, సి.ఇ. నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు పరస్పరం తెలియజేశారు. అనకాపల్లి అభివృద్ధి, టీడీపీ బలోపేతమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలన్న సంకల్పాన్ని నేతలు వ్యక్తం చేశారు.

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......