;

ఇంకొల్లులో ఘనంగా రేనాటి బిడ్డ వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

news

ఘనంగా రేనాటి బిడ్డ వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

ఇంకొల్లులో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పర్చూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షులు గుంజి అనిల్ కుమార్

ఇంకొల్లు:

స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి బిడ్డ వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆదివారం ఇంకొల్లు గ్రామంలోని పర్చూరు రోడ్ అంకమ్మ కాలనీలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షులు గుంజి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గుంజి అనిల్ కుమార్ మాట్లాడుతూ, వడ్డె ఓబన్న స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా, సైన్యాధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులకు వడ్డె ఓబన్న ముప్పుతిప్పలు పెట్టినట్లు చరిత్రలో స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

అనంతరం ఇంకొల్లు గ్రామంలోని రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న వడ్డెర కాలనీలో నివాసం ఉంటున్న గుంజి రాంబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఒక కాలు తొలగించుకున్న విషయం తెలుసుకున్న గుంజి అనిల్ కుమార్, సబ్‌ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. సురేష్, గుంజి వెంకటేశ్వర్లు కలిసి ఆయనను పరామర్శించారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకొని, వారి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేశారు.

ఈ సందర్భంగా గుంజి అనిల్ కుమార్ మాట్లాడుతూ, గుంజి రాంబాబుకు ప్రభుత్వ పింఛను మంజూరు అయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......