;

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులు వేగవంతం – 15లోగా పూర్తి చేయాలని ఆదేశాలు

news

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులు వేగవంతం – 15లోగా పూర్తి చేయాలని ఆదేశాలు

ములుగు జిల్లా, మేడారం:

ములుగు జిల్లా మేడారంలో కొలువుదీరిన శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మేడారం జాతరకు సంబంధించిన శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై సహచర మంత్రులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాశ్వత నిర్మాణాలతో పాటు జాతర యొక్క సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.260 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.

జాతర నిర్వహణకు రూ.150 కోట్లు

శాశ్వత ఆలయాలు, మౌలిక వసతుల నిర్మాణాలకు రూ.110 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం పనులు 85 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం పనులను ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని, భక్తుల సౌకర్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. తాగునీరు, వైద్య సేవలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......