గవర జాతీయుల పేద విద్యార్థులకు కొనసాగుతున్న ఆర్థిక సహాయం
గవర జాతీయుల పేద విద్యార్థులకు కొనసాగుతున్న ఆర్థిక సహాయం
అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 మందికి రూ.1000 చొప్పున పంపిణీ
రాజమండ్రి, జనవరి 12:
అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ నేతృత్వంలో గవర జాతీయుల పేద విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతినెల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం గవర జాతీయులందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 60 మంది విద్యార్థులకు (50 + 10 మంది) ప్రతినెల రూ.1000/- చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది.
సాధారణంగా ప్రతి నెల 11వ తేదీన ఈ ఆర్థిక సహాయం విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతుంటుంది. అయితే 2026 జనవరి 11వ తేదీ ఆదివారం కావడంతో, ఈ నెలలో జనవరి 12వ తేదీ (నేడు) విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1000/- చొప్పున జమ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు.
ఈ నెలతో వరుసగా ఏడవ నెల కూడా నిరంతరంగా ఈ సహాయం అందించడం జరిగిందని తెలిపారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా గవర జాతీయుల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ట్రస్ట్ నాయకత్వం పేర్కొంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ ఆడారి ఉమా శంకరరావు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
– ఆడారి ఉమా శంకరరావు
(ఫౌండర్ & చైర్మన్)
అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య
సెల్: 8328417559
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......