;

యువకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి -కుటుంబానికి న్యాయం చేయాలి: జూపూడి శ్రీనివాసరావు

news

యువకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి: జూపూడి శ్రీనివాసరావు

గుంటూరు, జనవరి 19, 2026:

యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత యువకుడికి మరియు అతని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల చీమలదిన్నె మహర్షిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మహర్షిని దాడికి గల కారణాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బడుగు, బలహీన వర్గాలపై అగ్రకులాల దాడులు కొనసాగుతుండటం దురదృష్టకరం అని తీవ్రంగా మండిపడ్డారు.

చిన్నపాటి ప్రమాదాన్ని కారణంగా చూపి, బట్లకోడూరు గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు రజక కులానికి చెందిన ఆటో డ్రైవర్ చీమలదిన్నె మహర్షిని చెట్టుకు కట్టేసి, రెండు గంటల పాటు విడతలవారీగా ముఖంపై, శరీరంపై తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై బాధితుడు పామూరు మండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల బాధిత కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోందని తెలిపారు.

తక్షణమే మహర్షికి న్యాయం చేయడంతో పాటు, బాధిత కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా రజక కుల సంఘాల నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......