;

ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఏపీఆర్సెట్–2024 ఇంటర్వ్యూలు

news

ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఏపీఆర్సెట్–2024 ఇంటర్వ్యూలు

అమరావతి, జనవరి 20:

ఏపీఆర్సెట్–2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను మండలి కార్యదర్శి బి. తిరుమపతిరావు సోమవారం విడుదల చేశారు.

అర్హత పొందిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇంటర్వ్యూలను రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయ కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, కేంద్రానికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించాలని ఆయన సూచించారు.

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......