డోన్ రైల్వే స్టేషన్‌లో రైల్వే జీఎంకు ప్రజా సమస్యల వినతిపత్రం
జనవరి 20, 2026:
డోన్ రైల్వే స్టేషన్‌లో రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిసిన సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, డోన్ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు రైల్వే సమస్యలను వివరించుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ముందు వృద్ధులకు ఉన్న రైల్వే రాయితీలు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయని, వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అలాగే, డోన్ రైల్వే స్టేషన్‌లోని అన్ని ఫ్లాట్‌ఫారాలపై ఏర్పాటు చేసిన గ్రానైట్ బండలు వర్షం పడిన సమయంలో జారే ప్రమాదం ఉందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాటిని రఫ్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
కొన్ని రైల్వే స్టేషన్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై రైల్వే శాఖ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, బేతంచర్ల స్టేషన్‌లో కరోనా ముందు ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని, తుంగభద్ర రైలును డోన్ వరకు పొడిగించాలని, నంద్యాల మీదుగా విజయవాడకు వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
డోన్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాల కోసం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని, అలాగే వందే భారత్ రైలును డోన్ స్టేషన్‌లో నిలిపేలా చూడాలని కోరారు. డెమో రైళ్లలో బాత్రూం సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రస్తుతం గుంటూరు వెళ్లే రైలు నాలుగో ఫ్లాట్‌ఫారం నుంచి బయలుదేరుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒకటి లేదా రెండు ఫ్లాట్‌ఫారాల నుంచి బయలుదేరేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా, డోన్ ఏఎన్ బంగ్లా బ్యాక్‌సైడ్ మరియు అమ్మ హోటల్ ఏరియాల్లో రైల్వే స్టేషన్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
డోన్ పట్టణ ప్రజల తరఫున ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు.
📎 Similar News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......
🆕 Latest News