;

బీసీ కార్పొరేషన్కి నిధులు లేకుండా చైర్మన్దేనికి : మిరియం

news

*బీసీ కార్పొరేషన్కి నిధులు లేకుండా చైర్మన్దేనికి : మిరియం

*ఉలవపాడు, జనవరి 21: కందు కూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం లో కరేడు గ్రామ బీసీ నాయకులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీసీ కార్పొరేషన్ లకు నిధులు లేకుండా చైర్మన్ లను ఎందుకు నియమించారు చంద్రబాబు నాయుడు అని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్రచైర్మన్ మిరియం శ్రీనివాసులు నూటికి 50% గా ఉన్నటువంటి బీసీలకు కులాల వారీగా బీసీ కార్పొరేషన్ చైర్మన్లను డైరెక్టర్లను నియ మించి అర్ధరూపాయి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.

*తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలే కారణం అని చెప్పిన ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిధులు లేకుండా బీసీలను మోసం చేయడం ఏమిటి అని ప్రశ్నిం చారు. ఓట్లు కోసం ఎన్నికల సందర్భంగా బీసీ రక్షణ చట్టం తెస్తానన్నారు నేటికీ అమలు పరచ లేదని అలాగే 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ బీసీలకు ఇస్తామన్నారు. అది నేటికీ అమ లు పరచలేదని ఈ విధంగా బీసీలను దగా చేస్తూ కాలం గడుపుతున్న చంద్రబాబునాయుడుకి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీల నుండి*

*తీవ్ర వ్యతిరేకత వస్తుందని శ్రీనివాసులు తెలి పారు. కార్పొరేషన్లకు నిధులు లేవు సంక్షేమ పథకాలకు నిధులు లేవు కానీ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయుట కొరకు సుమారు 1700 కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించిన చంద్రబాబు నాయుడుకి తగదు అని అన్నారు. ఒక వ్యక్తి కోసం ఇన్ని కోట్లు పెట్టటం అవసరమా అని ప్రశ్నించారు. నూటికి 50 శాతంగా ఉన్న బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రజ లను మోసం చేయటం ఏమిటని ప్రశ్నించారు.*

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......