;

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ – సేవా కార్యాచరణ ప్రకటన

news

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ – సేవా కార్యాచరణ ప్రకటన

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గవర జాతీయులు ప్రస్తుతం ఉన్న BC–D వర్గాన్ని BC–A గ్రూప్లోకి మార్చాలని, అలాగే కులగణన సర్వే నిర్వహించాలి అనే డిమాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన గవర జాతీయులందరూ ఏకతాటిపై నిలవాలి అనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ స్థాపించబడింది.

ఈ లక్ష్యాల సాధన కోసం ట్రస్ట్ తరపున మేము అహర్నిశలు పోరాడుతున్న విషయం మన జాతీయులందరికీ తెలిసిందే.

ఇదే కాకుండా, మన గవర జాతీయులు అనాధలుగా మిగలకూడదనే ఉద్దేశంతో, అట్టి పిల్లలను ఆశ్రయ గృహాలకు పంపి, వారి పూర్తి బాధ్యతలు ట్రస్ట్ స్వయంగా తీసుకుంటూ సేవలందిస్తోంది.

అలాగే, మన గవర జాతీయ యువకులు నిరుద్యోగంతో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండేందుకు, వారికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ట్రస్ట్ వారి వెంట నిలుస్తోంది.

నేడు మన కులం విద్యలో ముందంజలో ఉండటం పరమేశ్వరుడి, నూకాలమ్మ దయవల్ల సాధ్యమైంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరికీ చదువు మధ్యలో ఆగకూడదు అనే సంకల్పంతో, వారి పరిస్థితులను బట్టి కొందరు విద్యార్థులను దత్తత తీసుకుని, వారి పూర్తి విద్యా ఖర్చులు ట్రస్ట్ భరిస్తోంది.

ఇంకొందరికి ప్రతినెల రూ.1,000/- ఆర్థిక సహాయం, అలాగే పండుగల సమయంలో ప్రత్యేక సహాయం అందిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.

ఇటీవల మన గవర జాతీయుల్లోని పేద, వితంతు మహిళలు లేదా 40 సంవత్సరాలు దాటిన పేద మహిళలకు ట్రస్ట్ తరపున పూర్తి ఖర్చులతో వివాహాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాము. ఇప్పటికే కొందరిని ఎంపిక చేయడం జరిగింది.

వారికి ఈ మార్చి నెలలో, ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కుల గౌరవనీయులు, నాయకుల చేతుల మీదుగా వివాహ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

ఇన్ని సేవలు చేస్తున్నప్పటికీ,

ఎవరినీ ఒక్క రూపాయి కూడా చందాగా అడగలేదు

నా స్వంత డబ్బును బ్యాంకులో వేయకుండా

కొందరు స్వచ్ఛందంగా ఇచ్చిన స్థిరాస్తులపై చట్టబద్ధ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన వడ్డీతోనే ఈ సేవలన్నీ కొనసాగిస్తున్నాం

ఈ విషయం గతంలో కూడా తెలియజేశాను.

అదే కారణంగా, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో డబ్బు అవసరం ఉన్నవారు, తమ పూర్తి ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌తో, ఫోన్ ద్వారా గానీ, ప్రత్యక్షంగా గానీ సంప్రదించవచ్చు.

ముఖ్య గమనిక

ఈ సేవా కార్యక్రమాలకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న కింది గౌరవనీయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు:

ఆడారి నాగేశ్వరరావు గారు – విజయనగరం

కొనతాల విశ్వనాదం గారు – విజయనగరం

మారిశెట్టి వెంకట నరసింహ మూర్తి గారు – తాడేపల్లిగూడెం

మారిశెట్టి దశ వెంకట రమణ గారు – దగ్గులూరు

చదరం సూర్యనారాయణ గారు – లక్ష్మీనారాయణపురం

వేగి మహాలక్ష్మి నాయుడు గారు – విజయరామరాజుపేట (చోడవరం)

శ్రీమతి ఆళ్ళ నాగ వెంకట రామలక్ష్మి గారు – పెందుర్తి

దాడి నాయుడు గారు – అనకాపల్లి

వారందరికీ సదా నా కృతజ్ఞతలు.

మీ,

ఆడారి ఉమా శంకరరావు

(ఫౌండర్ & చైర్మన్)

అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్

📞 సెల్ : 8328417559

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......