;

తిరుపతి జిల్లా పుత్తూరు డి ఎస్ పి,సబ్ రిజిస్ట్రార్ సిబ్బందితో ఎఫ్ ఆర్ టి ఐ నేతలు ముమ్మర భేటీ

news

తిరుపతి జిల్లా పుత్తూరు డి ఎస్ పి,సబ్ రిజిస్ట్రార్ సిబ్బందితో ఎఫ్ ఆర్ టి ఐ నేతలు ముమ్మర భేటీ 

తిరుపతి 

ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ గౌరవ అధ్యక్షులు పి.చంద్రమోహన్,జాతీయ అధ్యక్షులుఎం.ప్రసాద్ సూచనల మేరకు,జాతీయ సంయుక్త కార్యదర్శి కె.అజయ్ ప్రసన్న కుమార్  నేతృత్వంలో దేశ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లాలో,పుత్తూరు డి ఎస్ పి జి.రవి కుమార్ తో, సబ్ ఇన్స్పెక్టర్ వి 

అశోక్ మరియు పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ తో,కలిసి చట్టాలతో కూడిన ఫోరం ఫర్ ఆర్ క్యాలెండర్ ను అందించి, సంబంధిత శాఖల అధికారుల నుంచి సామాన్య ప్రజలకు కూడా కావలసిన సమాచారాన్ని ఆర్ టి ఐ చట్టం నిర్దేశిత గడువు లోపల అందించాలని తెలియచేశారు.ఆర్ టి ఐ సెక్షన్స్ చట్టం ప్రకారం, వారి శాఖ నుంచి సమాచారం  ప్రజలకు సత్వరం అందేలా చేస్తామని తెలిపారు.ఆ సందర్భంలో, సీనియర్ అసిస్టెంట్ పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ కొంతకాలంగా అందుబాటు లో లేరు, సెలవులో ఉన్నారు, ఆ నియోజకవర్గ,మండల ప్రజల ల్యాండ్ కు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్స్ వారే చూస్తున్నామని చెప్పటం గమనార్హం.ఈ సందర్భంలో, సామాన్య ప్రజల పట్ల,సమాజం పట్ల తమ దైన శైలిలో బాధ్యత గా ఉంటున్న, ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్ సంస్థ అన్ని శాఖల నేతలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బందిని, ప్రజలు అందరికీ కూడా పారదర్శకంగా గవర్నమెంట్ నుంచి మంచి సర్వీస్ అందిస్తూ,ఎక్కడా అక్రమాలు,అవినీతికి  తావులేకుండా చూడాలని తెలిపారు.వారు సమాధానంగా చెపుతూ, వారి ఆఫీసు పరంగా ముఖ్యంగా సామాన్య ప్రజలుకు కూడా సేవలు సకాలంలో అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జాతీయ కమిటీ నేత కె .అజయ్ ప్రసన్న కుమార్ తో పాటు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కరాటే డి సి ఎస్ రాయల్ , తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ బి. వెంకట్,తిరుపతి జిల్లా మహిళా ఇంచార్జి,పుత్తూరు, నగరి, సత్యవేడు నియోజకవర్గం ల ప్రెసిడెంట్ వి.జయ లక్ష్మీ, తిరుపతి జిల్లా ఇంచార్జి అధ్యక్షులు మరియు కమిటీ ప్రెసిడెంట్ జి.వేణు గోపాల్ పాల్గొన్నారు.

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......