;

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

news

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే

నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు…

నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు…

నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు…

అతడే — నాన్న.

నువ్వు పుట్టిన ఆ క్షణంలో

మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు

ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు.

నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూసుకున్నవాడు…

నాన్న.

రాత్రంతా నిద్రలేక నీ పక్కనే కూర్చొని,

నీ ప్రతి కదలికకే ఉలిక్కిపడి,

నీ ఆరోగ్యం కోసం మౌనంగా దేవుడిని ప్రార్థించినవాడు…

నాన్న.

నువ్వు తొలిసారి “నాన్న” అని పిలిచిన క్షణం

అతని జీవితానికి దొరికిన గొప్ప బిరుదు.

నీ తొలి అడుగు, తొలి మాట, తొలి విజయం…

ప్రతి చిన్న ఆనందాన్ని పండుగగా మార్చుకున్నవాడు… నాన్న.

నువ్వు పడిపోతే గాయం నీ శరీరానికి…

కానీ నొప్పి అతని మనసుకు.

నీ కన్నీళ్లు నీ కళ్లలో కనిపిస్తే

ఆ బరువును మోసేది అతని గుండె… నాన్న.

స్కూల్ రోజుల్లో నీ సీటును తుడిచి

నీకు సౌకర్యంగా కూర్చోబెట్టినవాడు,

ఎండలో తాను కాలిపోతూ

నీకు నీడగా నిలిచినవాడు… నాన్న.

నీ బాల్యంలో నీ చేయి పట్టుకుని నడిపించాడు,

యవ్వనంలో నీకు దారి చూపించాడు,

జీవితంలో నువ్వు నిలబడే వరకు

నీ వెనుక కొండంత అండగా నిలిచాడు… నాన్న.

చదువు విలువ తెలియకపోయినా

చదువు గొప్పతనాన్ని బాగా తెలిసినవాడు.

తన చేతిలో పుస్తకం లేకపోయినా

నీ చేతిలో భవిష్యత్తు ఉండాలని కోరుకున్నవాడు… నాన్న.

నీ ఫీజుల కోసం అప్పులు చేసినవాడు,

నీ కలల కోసం తన కోరికలను త్యాగం చేసినవాడు,

నీ నవ్వు కోసం తన బాధలను దాచుకున్నవాడు…

అతనే నాన్న.

ఎండలో చెమటోడ్చి, వానలో తడిసి,

అవమానాలను దిగమింగి, అప్పుల భారాన్ని మోసినా

నీ ముందు మాత్రం చిరునవ్వే అతని ముఖం…

ఎందుకంటే నీ భయం అతనికి అంగీకారముకాదు… నాన్న.

ప్రతి పండుగలో, ప్రతి సందర్భంలో

తన అవసరాలను పక్కనబెట్టి

నీ కోరికలను నెరవేర్చినవాడు… నాన్న.

ఒక రోజు నువ్వు విజయాన్ని సాధించి

ఇంటి గుమ్మం దాటినప్పుడు

ప్రపంచం నీ విజయాన్ని చూస్తుంది…

కానీ ఆ విజయానికి వెనుక ఉన్న

చెమట, కన్నీరు, త్యాగం, ప్రేమను

ఎవ్వరూ చూడరు…

అవి అన్నీ — నాన్న కథలు.

ఆ రోజు అతని కళ్లలో కనిపించే చెమ్మ

కేవలం ఆనందం కాదు…

జీవితాంత పోరాటానికి దక్కిన ప్రశాంతత.

అప్పుడు నువ్వు అతని చేతిని పట్టుకుని

ఒక మాట చెబితే చాలు…

“ఇక మీ కష్టాలకు ముగింపు, నాన్నా…

ఇప్పటి నుంచి నేను మీకు అండగా ఉంటాను…”

ఆ క్షణంలో అతని జీవితభారం

మౌనంగా కరిగిపోతుంది.

గుర్తుంచుకో…

నీ ప్రతి అడుగులో అతని చెమట ఉంది.

నీ ప్రతి విజయానికి అతని త్యాగం ఉంది.

నీ ప్రతి చిరునవ్వులో అతని ప్రేమ ఉంది.

నీ భవిష్యత్తు అతని కలల ప్రతిబింబం…

నీ జీవితం అతని కష్టాల పుస్తకం…

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే.

📎 Similar News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

“8 ఏళ్ల కఠోర అకడమిక్ పోరాటం… చివరికి డాక్టర్‌గా కీర్తన సంచలనం!”

📚 ఉన్నత విద్యా ప్రపంచంలో Ph.D. అనేది అత్యంత కఠినమైన, శ్రమతో కూడిన పరిశోధన ప్రయాణం. అది కేవలం ఒక డిగ్రీ కాదు—కఠోర పరిశోధన, మానసిక స్థైర్యం, నిరంతర పట్టుదలతో నిర్మితమయ్యే ఒక జీవన పరీక్ష.👩‍🎓 కీర్తన గారి ప్రయాణం (ఇప్పుడు డాక్టర్ కీర్తన) ఇదే నిజాన్ని అత్యంత గంభీరంగా ప్రతిబింబిస్తుంది. ఎనిమిదేళ్ల నిరంత......

🆕 Latest News